పెగడపల్లి : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని ఆ పార్టీ పెగడపల్లి మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జగిత్యాల పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాఠం తిరుపతి అధ్యక్షతన పార్టీ జండా ఆవిష్కరించి, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో రాములపల్లితో పాటు అనుబంధ గ్రామం రాంనగర్ లో లక్షలాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట గంగాభవానీ- శ్రీనివాస్, పార్టీ నాయకులు రాజు ఆంజనేయులు, ఉప్పుగండ్ల నరేందర్ రెడ్డి మాదారపు కరుణాకర్‌రావు, తోట మహేందర్, కట్ల తిరుపతి, పత్తెం లింగయ్య, ఉప్పలంచ లక్ష్మణ్, నాగుల రాజశేఖర్ వెల్మ సత్యనారాయణరెడ్డి, మడిగెల తిరుపతి, కాశెట్టి వీరేశం, సుదర్శన్, అంజి, భూమయ్య, కొమురయ్య, శంకరయ్య తదితరులున్నారు.