Godavarikhani : గోదావరిఖనికి చెందిన సీనియర్ న్యాయవాది, నోటరీ గోషిక ప్రకాష్ (51) గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా పెద్దపల్లికి సహచరులతో కలిసి కారులో వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన తోటి న్యాయవాదులు ప్రకాష్‌ను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా ప్రకాష్ మృతి చెందారు.
అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు)జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా గోషిక ప్రకాష్ కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి తౌటం సతీష్, సిరిగ సంజయ్ కుమార్ సంతాపం తెలిపారు. కార్యవర్గ సభ్యులు, చందాల శైలజ, ఉమర్, అసంపల్లి రవీందర్, తదితరులు సంతాపం ప్రకటించారు. ప్రకాష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.