 
                                                            రామగుండం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు (KTR birthday ) సందర్భంగా బీఆర్ఎస్(BRS) శ్రేణులువేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్(Former MLA Chander) ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదికలో అన్నదానం , ఆశ్రమాల్లో చద్దర్ల పంపిణీ ని నిర్వహించారు.

ప్రధాన కూడళ్లలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. స్దానిక తిలక్‌నగర్‌లో పారిశుధ్య కార్మికుల (Sanitation Labours) మధ్య కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. ప్రధాన చౌరస్తా, బీఆర్ఎస్ కార్యాలయంలో కెక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి కేటీఆర్ అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలను పెంచి వారికి అండగా నిలిచారని కొనియాడారు. కార్పొరేటర్లు పెంట రాజేష్, పాముకుంట్ల భాస్కర్ , నాయకులు పాల్గొన్నారు. కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా గోదావరి ఖనిలోని వీహెచ్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రక్తదానం , నిరుపేద క్యాన్సర్ పేషెంట్ కు ఆర్థిక సహాయం అందజేశారు. వీహెచ్‌ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల్లహరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
                            