కమాన్ పూర్ : మండలంలోని పెంచికల్ పేట్ గ్రామంలో నిర్వహిస్తున్న వన దేవత జాతరలో ప్రధాన ఘట్టం వైభవంగా జరిగింది. జాతర మహోత్సవంలో భాగంగా గురువారం సమ్మక్క గద్దెనెక్కింది. డప్పు చప్పుల్లు.. శివసత్తుల పూనకాల మధ్య కోయ పూజారులు సమ్మక్క తల్లిని గద్దెపై ప్రతిష్టించారు.
ఇదివరకే సారాలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులు గద్దెకు చేరి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సమ్మక్క కూడా గద్దెపై చేరడంతో.. వన ప్రవేశం చేసే వరకూ కోలాహలంగా ఉండనుంది. సమ్మక్క- సారలక్కల దర్శనం చేసుకుంటూ భక్తులు నిలువెత్తు బంగారం (బెల్లం ) తులాభారంతో పాటు మొక్కలు చెల్లించుకుంటారు.