కమాన్ పూర్ : మండలంలోని పెంచికల్ పేట్ గ్రామంలో నిర్వహిస్తున్న వన దేవత జాతరలో ప్రధాన ఘట్టం వైభవంగా జరిగింది. జాతర మహోత్సవంలో భాగంగా గురువారం సమ్మక్క గద్దెనెక్కింది.
సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మేడారం పరిసరాలు కోలాహలంగా మారాయి. ఆదివారం సెలవు కావడంతో తెలుగు రాష్ర్టాలతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు.