గోదావరిఖని : ఆరు దశాబ్దాలుగా తీరని ఆకాంక్షను తన ప్రాణాలు ఫణంగా పెట్టి స్వరాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పదేళ్ల పాటు అనితర సాధ్యంగా పాలించి తెలంగాణను సుసంపన్నం చేశారన్నారు. కేసీఆర్ జన్మదినం(KCR birthday) సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రామగుండం మెడికల్ కళాశాల ప్రభుత్వ హాస్పిటల్లో 71 మంది రక్తదానం చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మెక్కలను పంపిణీ చేశారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సత్కరించారు. ఈశ్వర కృషి ఆశ్రమంలో వృద్దులకు అన్నదానం చేశారు. జయదుర్గదేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ..కోట్ల గొంతుకలను ఏకంజేసి తెలంగాణను సాధించారని తెలిపారు.10 ఎళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు మూల విజయ రెడ్డి, బాదె అంజలి, పెంట రాజేష్, పాముకుంట్ల భాస్కర్ పి.టి స్వామి, గోపు అయిలయ్య యాదచ్, నడిపెల్లి మురళీధర్ రావు, అచ్చే వేణు, చల్లా రవీందర్ రెడ్డి, మెతుకు దేవరాజ్, సట్టు శ్రీనివాస్, రాకం వేణు, ఇరుగురాళ్ల శ్రావణ్, బండారి ప్రవీణ్, కోడి రామకృష్ణ, బచ్చాల రాములు, వడ్లకొండ మహేందర్, ఆవునూరి వెంకటేష్, చింటూ, యాసర్ల తిమోతి, తదితరులు పాల్గొన్నారు.