జూలపల్లి, సెప్టెంబర్ 23 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో మంగళవారం యూరియా లారీని కోనరావుపేట గ్రామ రైతులు అడ్డుకున్నారు. దాదాపు పది రోజులు గడుస్తున్న తమ గ్రామానికి ఒక్క యూరియా బస్తా అందలేదని వాపోయారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకున్నది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఏవో ప్రత్యూషను ఫోన్ ద్వారా రైతులు సంప్రదించారు.
ఎట్టకేలకు ఆ 450 బస్తాల లారీని కోనరావుపేటకు పంపించడానికి అంగీకరించారు. దీంతో తమ గ్రామానికి వచ్చే యూరియా లారీని కోనరావుపేటకు పంపడం ఏమిటని ఇక్కడి రైతులు ప్రశ్నించారు. రెండు గ్రామాల రైతుల నడుమ యూరియా చిచ్చు రేపింది. ఉద్రిక్తతల మధ్య యూరియా లారీని కోనరావుపేటకు తరలించారు. కార్యక్రమంలో రైతులు కూసుకుంట్ల రవీందర్ రెడ్డి, కత్తెర్ల రాయమల్లు, సంకసాని వెంకటరెడ్డి, హన్మంత రెడ్డి, రెడ్డి, అంజయ్య హనుమంతు తదితరులు పాల్గొన్నారు.