KCR Birthday Special | పెద్దపల్లి, ఫిబ్రవరి 15 : తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పేర్కొన్నారు. ఈ నెల 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టే వేడుకల్లో భాగంగా వృక్షార్చన పోస్టర్‌ను ఆమె ఇవాళ పెద్దపల్లి జంక్షన్లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 17న 101 మొక్కలు నాటుతామని తెలిపారు. భూతాపం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు దూరదృష్టితో ఆలోచించిన తొలి సీఎం కేసీఆర్ హరిత హారం, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, ఊరూరా నర్సీరీలు లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ నేల పచ్చటి వనాలతో పులకించి పోగా, నేటి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ నెల వెలవెలబోతుందని విమర్శించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పెద్దపల్లి నియోజక వర్గ ఇన్చార్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాగృతి నాయకుడు మనోజ్, బీఆర్ఎస్ నాయకులు భూమేశ్, అంబోజు నాగరాజు, చిట్టవేని వినీత్, నర్ల సాయి, శ్రీనివాస్, రాజేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు