కోరుట్ల, ఫిబ్రవరి 17 : కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను (KCR birthday )బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తో పాటు 50 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. ఎమ్మెల్యే సమక్షంలో కేక్ కట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు.
ధర్మారం మండల కేంద్రంలో
ధర్మారం, ఫిబ్రవరి 17: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ అనే మూడు అక్షరాల పేరిట కేకును ఏర్పాటు చేసి నంది మేడారం, పత్తిపాక ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాం రెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పార్టీ సీనియర్ నాయకులు జితేందర్ రావు, రామారావు తదితరులు కలిసి కేక్ కట్ చేశారు.
స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో సీఎం కేసీఆర్ ప్రముఖ పాత్ర వహించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. పది సంవత్సరాలపాటు రాష్ట్రానికి సీఎం కేసీఆర్ చేసిన సేవలు గొప్పవన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు.