Kalyana Lakshmi | కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద పేదింటి ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాడు. తులం బంగారం దేవుడెరుగు.. కేసీఆర్ ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయల నగదు కూడా ఇవ్వడం లేదు. ఒకటి రెండు చోట్ల ఆ డబ్బులు ఇచ్చినప్పటికీ.. అవెప్పటికోగానీ అందడం లేదు. కొన్ని చోట్ల అయితే ఏండ్లకు ఏండ్లు గడిచిపోతున్నది. దానికి పై ఫొటోనే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గోదావరిఖనిలో నిర్వహించారు. దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్దిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ చంటి బిడ్డను ఎత్తుకుని వచ్చి కల్యాణలక్ష్మీ చెక్కును అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ప్రభుత్వ పథకాలు ఎంత ఆలస్యంగా అమలవుతున్నాయో చెప్పేందుకు ఇదే సాక్ష్యమని చెప్పుకుంటున్నారు.