సుల్తానాబాద్ రూరల్, జూలై 17: గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ (JAC) చైర్మన్‌గా జొన్నకోటి వెంకటేష్ నియమితులయ్యారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో పెద్దపల్లి జిల్లా గ్రామపంచాయతీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ కమిటీని ఏకీగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మామిడి కొమురయ్య, జిల్లా జేఏసీ చైర్మన్‌గా జొన్నకోటి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కాసిపేట అశోక్, వైస్ చైర్మన్‌గా పసునూటి సంతోష్, దొడ్డిపేట కనకయ్య, అమరగోని పురుషోత్తం, కోశాధికారి బర్ల భూమయ్య, సలహాదారులుగా ఆర్.సత్తన్న, కత్తిమల్ల రాజలింగయ్య ఎన్నికయ్యారు.
అదేవిధంగా సహాయ కార్యదర్శిగా సత్యం, సుధాకర్ రెడ్డి, ఆసరి రమేష్, తుమ్మ మధుసూదన్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మిట్ట శ్రీనివాస్, వేల్పుల రాజేష్, రాచకొండ భీమ్రాజ్, ప్రచార కార్యదర్శిగా క్యాదాసి కుమార్, గుండ రమేష్ , మెంబర్స్, ఎర్రం రామ్ రెడ్డి, విట్టం సంపత్, రాజమౌళి, మంగ సంతోష్, ఇరుగరాళ్ల శంకర్, కిరణ్, వంగ భాస్కర్, రాజ్‌కుమార్, ప్రదీప్, వికాస్, సాగర్, అనురాధ జేఏసీ సభ్యులుగా ఎన్నుకున్నారు.