అంతర్గాం, జనవరి 4 : పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎగ్లాస్ పూర్ గ్రామంలో కోతులను గ్రామం నుండి తరిమేందుకు గ్రామపంచాయతీ కార్యవర్గం వినూత్న ఆలోచన చేశారు. కోతులను గ్రామం నుంచి బయటకు పంపేందుకు గ్రామ సర్పంచ్ జూపాక మమత ఆధ్వర్యంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు గ్రామ యువత విచిత్ర వేషదారణతో గ్రామంలో కోతులను బయటకు పంపే ప్రయత్నం చేపట్టారు.
కోతుల బారి నుండి కపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కోతులు గ్రామంలోకి రాకుండా ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. గ్రామాలలో కోతుల బెడతో బయటికి వచ్చే పరిస్థితులు లేవని, కోతులతో ప్రజలు రోజువారి పనులు చేసుకోలేక పోతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలపైన, వృద్ధుల పైన పడి దాడులు చేయడంతో ప్రజలు తీవ్రమైన భయాందోళనకు గురి అవుతున్నరన్నారు. గ్రామపంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో కోతులను తరిమేందుకు ప్రయత్నాలు చేపట్టమని తెలిపారు.