ఓదెల, మే 8 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును పరిశీలించారు. అకాల వర్షాలు ముప్పు పొంచి ఉన్నందున ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
హమాలీల సంఖ్యను పెంచి కొనుగోలు త్వరితగతిన జరిగేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. లారీల కొరత లేకుండా చూస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా మొక్కజొన్న కొనుగోళ్లలో ఎకరాకు 25 క్వింటాళ్ల కొనుగోలు నిబంధన సడలించాలని పలువురు రైతులు కలెక్టర్కు విన్నవించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ధీరజ్ కుమార్ గౌడ్, ఏపీఎం సంపత్ తదితరులు ఉన్నారు.