రామగిరి మార్చి 19: రోడ్డు ప్రమాదంలో(Rod accident) గాయపడిన వ్యక్తిని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరామర్శించారు. వివరాల్లోకి వెళ్తే.. నాగేపల్లి గ్రామానికి చెందిన రాచకొండ శంకర్ తాడిచర్ల ఏఎంఆర్ కంపెనీలో ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల డ్యూటీ కి వెళ్తున్న సమయంలో మంథని- పెద్దపల్లి ప్రధాన రహదారి రామయ్యపల్లె వద్ద ఇసుక లారీ ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి.
కాగా, హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం నాగేపల్లి గ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్న రాచకొండ శంకర్ ను పుట్ట మధుకర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మధుకర్ వెంట మాజీ సర్పంచ్ కొండవేనా ఓదెలు, బీఆర్ ఎస్ నాయకులు పూదరి సత్యనారాయణ గౌడ్, కుమార్ యాదవ్, కాపురబోయిన భాస్కర్, దామెర శ్రీనివాస్, గద్దల శంకర్ తదితరులు ఉన్నారు.