కాల్వ శ్రీరాంపూర్, సెప్టెంబర్ 2 : యూరియా కొరత లేదని ప్రభుత్వం ప్రకటిస్తుండగా గ్రామాల్లో మాత్రం రైతులు యూరియా (Urea) కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం సహకార కేంద్రం వద్ద అర్ధరాత్రి నుండి యూరియా కోసం రైతులు క్యూ లైన్ కట్టారు.
యూరియా లేక పంటలు పండే పరిస్థితి లేదని వాపోయారు. గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.