Peddapalli | పెద్దపల్లి రూరల్ ఫిబ్రవరి 02 : అధికారుల నిర్లక్ష్యమో, పాలకుల పట్టింపులేని తనమో తెలియదు కాని పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో గత పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన శుద్దజల కేంద్రం(మినరల్ వాటర్ ప్లాంట్ ) కాస్తా మూతపడింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలోనే ప్రజల సౌకర్యార్థం 500 లీటర్ల సామార్థ్యం కల్గిన శుద్ద జలకేంద్రాన్ని 2014-15 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. కొంతకాలంపాటు నడిచిన శుద్ధ జల కేంద్రం కాస్తా నిర్వహణ సక్రమంగా లేని కారణంగా నడవకుండా నిలిచిపోయింది.
శుద్ధ జల కేంద్రం మూతపడటంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ గ్రామస్తులంతా బయట ప్రాంతాల నుంచి మినరల్ వాటర్ కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటున్నారు. వారి బాధలను నిత్యం చూస్తున్న అధికారులు, పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇటీవల నూతనంగా ఎన్నికైన పాలకవర్గమైనా గ్రామపంచాయతీలో మూలన పడి తుప్పుపడుతున్న శుద్ధ జల కేంద్రం మినరల్ వాటర్ ప్లాంటును తెరిపించి నడిపించడంతో ప్రజల తాగునీటీ అవసరాలు తీర్చేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Turkalamaddikunta1

Turkalamaddikunta2