పెద్దపల్లి, సెప్టెంబర్ 23: ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి మేలు చేస్తుందని డీఎంహెచ్వో డాక్టర్ వాణిశ్రీ అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎంబీ గార్డెన్లో నిర్వహించిన ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు.
ఆయుర్వేద మెగా వైద్య శిబిరంలో దాదాపు 470 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆయుష్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ జీఎన్ అరుణ్, జిల్లా ఆయుష్ ప్రోగ్రాం మేనేజర్ ఎస్ విద్యాసాగర్, వైద్యులు మహేష్, అమర్నాథ్, ప్రభాకర్, దివ్య, నిహారిక, మారుతి, శిరీష, ఫార్మాసిస్టులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.