Sridhar babu | ముత్తారం : ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఆవిర్భవించడంలో బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని, అట్టడుగు వర్గాల్లో జన్మించి ప్రపంచ మేధావిగా, శక్తిగా ఎదిగిని మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మచ్చపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత మన దేశానికి రాజ్యాంగం రచించడంలో కీలకపాత్ర పోషించారని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తి కాపాడాలని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని తమ పార్టీ, ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఆయన స్పూర్తితో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హలును రూ.కోటీ తో నిర్మించి అందులో లైబ్రరీని ఏర్పాటు చేస్తామని, దీనికి త్వరలో నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
అభివృద్ధి పనులకు పనులకు శంకుస్థాపన
అంబేద్కర్ స్పూర్తితో ముందుకుసాగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మండలంలోని మచ్చుపేట గ్రామంలో పలు రొడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నాడు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఖమ్మంపల్లి నుంచి ఓడేడు వరకు 15 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను రూ.30 కోట్లతో, గంగాపురి నుంచి ఓడెడు వరకు 19 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను రూ.60 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. మచ్చుపేట గ్రామంలో బగుళ్ల గుట్టలో దేవాలయ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని, వారికి సౌకర్యంగా ఉండే విధంగా రూ.2 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం పనులు, విద్యుత్ లైన్ పనులు పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు. నాణ్యతలో ఎటువంటి లోపం లేకుండా రోడ్డు నిర్మాణ పనులు జరగాలని, దీనిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. రైతులకు శుక్రవారంపేట 2 టీఎంసి నుండి నిరంతరం నీరు విడుదల చేసి మండలంలోని రైతుల పంటలు ఎండకుండా కాపాడామని చెప్పారు. వానాకాలం పంటలో సన్నరకం పండించిన ధాన్యానికి రూ.1800 కోట్ల బోనస్ చెల్లించామని అన్నారు. సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
యువకుడికి సన్మానం
మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మోత్కూరి సురేశ్ కు గ్రూప్-1 ఫలితాల్లో 333 ర్యాంక్ సాధించడంతో అతడిని మంత్రి శ్రీధర్ బాబు శాలువాతో సన్మానించారు. మారుమూల ప్రాంతంలో రైతు కుటుంబం నుండి వచ్చి గ్రూప్-1లో ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మంచి హోదాలో పనిచేస్తూ మండలానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు. ఈ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జెడ్పీటీసి చొప్పరి సదానందం, నాయకులు పాల్గొన్నారు .