DOuble Bed Room Houses | పెద్దపల్లి టౌన్, మే 27 : పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చందపల్లి, హనుమంతుని పేట శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జూన్ నెలలో మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ విజయ రమణారావు తెలిపారు.
మంగళవారం చందపల్లె హనుమంతుని పేట గ్రామ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో రోడ్లు, త్రాగునీటి వసతి విద్యుత్తు సౌకర్యం లాంటి మౌలిక సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి లబ్ధిదారుని పేరు మీద విద్యుత్ మీటర్ తీసుకోవడంతోపాటు జూన్ మాసంలో మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా గృహప్రవేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహప్రవేశానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఏఈ సతీష్, మాజీ కౌన్సిలర్లు బూతగడ్డ సంపత్, నూగిళ్ల మల్లయ్య, నెట్టెట్లా స్వరూప కొమురయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భూషణ వేణి సురేష్ గౌడ్, నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Rains | హైదరాబాద్కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు