పెద్దపల్లి రూరల్ డిసెంబర్ 03 : స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని డీసీపీ భూక్య రాంరెడ్డి అన్నారు. సర్పంచ్ ఎన్నికలకు మూడవ విడుతలో భాగంగా పెద్దపల్లి మండలంలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులంతా సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేటతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను బుధవారం సంబంధిత పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఎస్ఐ, సీఐ లకు సమాచారం ఇవ్వాలనే వారు స్పందించకుంటే ఏసీపీకి సమాచారం చేరవేయాలని సూచించారు.
ఎలాంటి ఇబ్బందులనైనా పరిష్కరించేందుకు పోలీసు శాఖ తరపున సిద్ధంగా ఉన్నామని ఆ దిశగా ముందుకు సాగుతు ఎన్నికల తంతు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసేలా చూడాలన్నారు. డీసీపీ వెంట పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.