సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 06 : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలను కల్పించామని జిల్లా సహకార అధికారి శ్రీమాల అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం సుల్తానాబాద్ పట్టణంలోని సుగ్లంపల్లిలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి డీసీవో హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గన్నీ సంచుల కొరత లేకుండా చూస్తామన్నారు.
కొనుగోలు కేంద్రాలలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు.
వర్షం నుంచి ధాన్యాన్ని రక్షించుకున్నందుకు రైతులు కూడా సహకరించాలని కోరారు. రైతులు కూడా సెంటర్ నిర్వాహలకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్ వెంకటేశ్వర్లు, నాయకులు గాజుల రాజమల్లు, పన్నాల రాములు, దుగ్యాల సంతోష్ రావు, లక్ష్మీనారాయణ, శేఖర్, సీఈవో సంతోష్, తదితరులు ఉన్నారు.
అలాగే మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని చిన్న బొంకూర్, మియాపూర్, పెరికపల్లి, రెబల్ దేవుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కందుల రాజు, నాయకులు పకీర్ యాదవ్, పోచమల్లు యాదవ్, సీఈఓ రమేష్, పాలకవర్గ సభ్యులు మాధవరావు, వీరయ్య, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.