Peddapally | పెద్దపల్లి టౌన్ జూన్ 9 : కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో ముస్లింల జనాభా ప్రతిపాదికన మంత్రి పదవి ఇవ్వలేదని, ముస్లిం డిక్లరేషన్ విస్మరించిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో లోపు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పును సవరించుకొని ముస్లింలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని ముస్లిం ఐక్యవేదిక నాయకులు మోహిద్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీల్లో ముస్లిం డిక్లరేషన్ ఏర్పాటు చేస్తామని, చెపి అమలు చేయలేదని ఆరోపించారు. 13.5 శాతంగా ఉన్న ముస్లింలకు మంత్రివర్గంలో మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం, ముస్లింలను విస్మరించడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ముస్లింలను విస్మరిస్తే, రానున్న మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారానే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. ముస్లిం డెకరేషన్ విస్మరించిన కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో బొంద పెడతామని ప్రతిన పూనారు. ఇక్కడ షారుక్, కలీం రహమతుల్లా, తాజోద్దీన్, మాలిక్ జమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.