పెద్దపల్లి, సెప్టెంబర్16: అతివల ఆరోగ్యం పై అవగాహన కల్పించేందుకు పక్షం రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఈనెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు నిర్వహించే స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్‌పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జల్ద అరుణ శ్రీతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశయ్యారు. స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రణాళికబద్దంగా నిర్వహించాలని సూచించారు.
మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, అనేమియా, టీబీ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వాణిశ్రీ , డీపీవో వీరబుచ్చయ్య, డీఈవో డీ మాధవి, జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల్, ప్రోగ్రాం ఆఫీసర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.