పెద్దపల్లి, అక్టోబర్14 : విద్యార్థులలో జ్ఞానంతో పాటు సృజనాత్మకత పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఉపాధ్యాయులకు థింక్ -పెయిర్ -షేర్ (ఆలోచించు -జతకట్టు -పంచుకో) విధానంపై మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. థింక్ -పెయిర్ – షేర్ విధానంపై ఉపాధ్యాయులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలలో మౌనంగా, ఇన్‌యాక్టివ్‌గా ఉండే విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ మంచి బోధన అందించేందుకు థింక్ పెయిర్ షేర్ బోదన విధానం అమలకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విధానం ద్వారా ఒక ప్రశ్నకు విద్యార్థులు వ్యక్తిగతంగా ఆలోచించటం, జతగా చర్చించటం, సమాదానాలను పంచుకోవటం వల్ల విశ్లేషణ, సంశ్లేషణ, ఆలోచన విధానం పెరుగుందని పేర్కొన్నారు. బోధనలో ప్రతి విద్యార్ధిని భాగస్వామ్యం చేయడం ద్వారా విద్యార్థుల విద్యా ప్రమాణాలు క్రమంగా మెరుగవుతాయన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.