పెద్దపల్లి, ఫిబ్రవరి26: విద్యార్ధుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో గురువారం శక్తి కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య మంచి కనెక్టివిటీ ఏర్పడాలని చేపట్టిన శక్తి కార్యక్రమం మంచి ఫలితాలు అందించిందన్నారు. శక్తి కార్యక్రమం అమలు వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, విద్యా ప్రమాణాలు కూడా మెరుగ్గా అయ్యాయన్నారు.
పాఠాలు బోధించడమే కాకుండా పిల్లల పట్ల ఉపాధ్యాయులు ప్రేమ చూపెడితే మంచి కనెక్టివిటీ ఏర్పడుతుందని చేపట్టిన శక్తి కార్యక్రమం జిల్లాలో విజయవంతమైందని పేర్కొన్నారు. సమావేశంలో డీఈవో శారద, అకాడమిక్ మానిటరింగ్ అధికారులు పీఎం షేక్, జీసీడీవో కవిత, మండల విద్యా ధికారులు , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.