పెద్దపల్లి, మే6 : జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అభివృద్ధి పనుల పురోగతిపై పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలోని హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్ భవనాలు, పాఠశాలల మరమ్మతులు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హస్టల్స్ మరమ్మతు పనులను ఈ వేసవి కాలం లోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ గిరీష్ బాబు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.