పెద్దపల్లి, ఫిబ్రవరి 27: జిల్లాలో జరుగుతున్న పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Koya Sri Harsha)పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని పట్టభద్రులు, టీచర్స్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ శాసన మండలిలో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ స్థానాల ఎన్నికల కోసం జిల్లాలో 36 గ్రాడ్యుయేట్స్, 14 పోలింగ్ టీచర్స్ పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు.
7 రూట్లలో 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం 10 గంటల వరకు పట్టభధ్రులు (2, 088 మంది) 6.73 శాతం, టీచర్స్ (152 మంది) 13.68 శాతం ఓటింగ్ నమోదైందని పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను కరీంనగర్‌లోని రిసెప్షన్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. ఆయన వెంట పెద్దపల్లి తహసీల్దార్ రాజయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే
పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి -పుష్పాలత రెడ్డి, మాజీ చైర్ పర్సన్ దాసరి మమతారెడ్డి – ప్రశాంత్‌రెడ్డి క్యూ లైన్లో నిలుచోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.