CMR Rice | సుల్తానాబాద్ మే 23. రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని సకాలంలో దించుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలో ఉన్న మిథిలా రైస్ మిల్లును ఆయన శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపిస్తున్నామని, మిల్లుల వద్ద ధాన్యం వేచి ఉండకుండా వెంటనే దించుకోవాలని, ఎక్కడా ఎటువంటి కోతలు విధించడానికి వీలు లేదని కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వం అందించిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ రైసును నిర్దేశిత గడువులోగా సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. పర్యటనలో కలెక్టర్ వెంట పౌర సరఫరాల మేనేజర్ శ్రీకాంత్, డీటీసీఎస్ లు మహేష్, రవీందర్, సంబంధిత అధికారులు ఉన్నారు.