పెద్దపల్లి రూరల్ నవంబర్ 11 : సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులంతా వినియోగించుకుని మద్దతు ధర పొందాలని అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట సింగిల్ విండో పరిధిలో ని సబ్బితం, కుర్మపల్లి, బొంపల్లి, మేరపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం చైర్మన్ సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం కోసమే కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండోల ఆధ్యర్యంలో ఏర్పాటు చేశామన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోకుండా ఉండేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిని వినియోగించుకుని ఆర్థికంగా బలపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈవో గడ్డి తిరుపతి, డైరెక్టర్ లు గండు వెంకన్న పటేల్ , కొత్త వెంకటమ్మ, నాయకులు చంద శంకర్ , అరికిల్ల లక్ష్మయ్య, గుర్రాల వీరేశం, గుర్రాల రాజు, ఆయా గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.