Peddapally | పెద్దపల్లిటౌన్, డిసెంబర్ 25 : దేశంలో అసమానతలకు మనస్మృతి కారణమని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కన్నెపల్లి అశోక్ ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట మనుస్మృతి పత్రాలను గురువారం దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ దేశంలో అహంకారపూరితంగా దేశ భద్రతకు ముప్పు వాటిలో విధంగా విశ్వహిందూ పరిషత్, సంఘ పరివార్, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలతో దేశానికి ప్రమాదం పొంచి ఉన్నదని ఆరోపించారు. దేశ ప్రజలు చైతన్యవంతమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పేర్కొన్నారు. అశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లేపల్లి అశోక్, దిలీప్, రవీందర్, స్వర్ణ, ప్రకాష్, శివాజీ, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.