సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 06: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చాతరాజు రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భూత్ అధ్యక్షులు సట్టు శ్రీనివాస్ పార్టీ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా చాతరాజు రమేష్ మాట్లాడుతూ.. జన సంగ్ నుంచి 1980, ఏప్రిల్ 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్పేయి, ఎల్కే అద్వాని ఆధ్వర్యంలో బీజేపీగా అవతరించిందన్నారు. అప్పుడు ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ వరుసగా మూడవసారి అధికారంలోకి రావడం జరిగిందనీ, ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు చాతరాజు అజయ్, కందుకూరి సుభాష్, మామిడి రాజకుమార్, ముక్కెర రాజకుమార్, వెంకటేష్, నివాస్, బాలాజీ, అన్వేష్, మహేందర్, రామగిరి రాజకుమార్, కుమార్, దూలం తిరుపతి, రాజం బాబు, చంద్రయ్య పాల్గొన్నారు.