పెద్దపల్లి : పెద్దపల్లి(Peddapalli )మండలం పెద్ద బొంకూరులో భక్త మార్కండేయ స్వామి జయంతి (Markandeya Jayanti)వేడుకలను పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి మాట్లాడుతూ.. బ్రహ్మ తన నుదుటిన 16 సంవత్సరాల ఆయుష్షు ఇచ్చినప్పటికి తను శివారాధన, భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో గురువుల పట్ల వినయ విధేయలతో యమధర్మరాజుని ఎదురించి చిరంజీవిగా నిలిచాడు. మార్కండేయ పురాణం రాసి నేడు మానవజాతికి ఆదర్శ ప్రాయుడయ్యాడని కొనియాడారు. నేడు మార్కండేయ పద్మశాలి నేతన్నల కుల దైవంగా పూజలందుకుంటున్నాడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పెద్ద బొంకూర్ పద్మశాలి సంఘo అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షులు చిప్ప భాస్కర్, నాయకులు బూర్ల ధనుంజయ మిట్టపల్లి కనకయ్య, వేముల రాంచంద్రం, వెంగల కనకయ్య, మిట్టపల్లి కొమురయ్య, పర్శ కొమురయ్య, మిట్టపల్లి వెంకటేశం, వేముల సురేష్, బూర్ల కొమురయ్య, నాగుల మల్లేశం, గంటి నందం, వేముల రమేష్, వేముల భూమయ్య, బైరి వెంకటేశం, వెంగల కొమురయ్య, ఎలిగేటి శేఖర్, మిట్టపల్లి చందు, గుండు రాజ్ కుమార్, మాటేటి రాజ్ కుమార్, పర్శ ఆనంద్, పర్శ శ్రావణ్, గుండు అజయ్,గుండు వంశీ కృష్ణ, కొండబత్తుల సతీష్,మిట్టపల్లి శేఖర్,సామల చంద్రమౌళి, బూర్ల ప్రణయ్, పిల్లలమర్రి నంబయ్య తదితరులు పాల్గొన్నారు.