హైదరాబాద్, ఫిబ్రవరి 14: ప్యూర్ ఈవీ..హైదరాబాద్‌లో మరో షోరూంను ప్రారంభించింది. రాష్ట్రంలో కంపెనీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త రిటైల్ అవుట్‌లెట్‌ను ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ షోరూంలో ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటర్, ఈట్రైస్ట్ ఎక్స్ మోటర్‌సైకిళ్లు కూడా లభించనున్నాయి.
వచ్చే రెండున్నరేండ్లలో దేశవ్యాప్తంగా 250 నూతన డీలర్‌షిప్‌లను నెలకొల్పబోతున్నట్టు ప్రకటించింది.