మహిళల భద్రతపై షీ టీమ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు అవగాహన
భూపతిపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మహిళల భద్రత, చైల్డ్ సేఫ్టీ, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు.
సుల్తానాబాద్ రూరల్ జూన్ 03 : పెద్దపల్లి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మహిళల భద్రత, చైల్డ్ సేఫ్టీ, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీమ్ మెంబర్ స్నేహలత మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరం గస్తీ నిర్వహిస్తారన్నారు.
ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. అత్యాశకు పోయి ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని అన్నారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100/112 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఆసియా బేగం, ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మి, షీ టీమ్ సభ్యులు, సురేష్, మౌనిక, పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

