Accident | రామగిరి, ఏప్రిల్ 13 : మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలోని సెంటినరికాలనీలోని ఆర్ఆర్ స్టేడియం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆటో ట్రాలీ బైక్ డికొని నాగేపల్లి గ్రామానికి చెందిన సంత్ (30) అనే ప్రయివేట్ ప్లంబర్ మృతి చెందాడు.
స్థానికుల కథనం ప్రకారం.. నాగేపల్లి కి చెందిన సంతు ఇటీవల హనుమాన్ దీక్ష చేపట్టి ఆదివారం కొండగట్టు దేవస్థానం వెళ్లి మాల విరమణ చేసి రాత్రి ఇంటికి చేరుకున్నారు. తన అక్క కూతురు పుట్టినరోజు ఉండగా ఉదయం కేక్, మటన్ తీసకువ్చేందుకు సెంటినరి కాలనీ కి బైక్ పై ఆదివారం వెళ్లాడు. ఈ క్రమంలో తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదం లో ట్రాలీ ఢీ కొట్టడం తో తల తీవ్ర గాయమైంది.
స్థానికులు అంబులెన్సులో చికిత్స కోసం పెద్దపల్లి దవాఖానకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామం లో విషాదం నెలకొంది. ఈ ఘటన పై రామగిరి పోలీసులు కేసు దర్యాప్తు తెలిపారు.