మంథని, మార్చి 4: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు(Intermediate exams) రేపటి నుంచి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యం ఐనా అనుమతించనున్నారు. మంథనిలోని ప్రభుత్వ బాలికలు, బాలుర కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల సమాచారాన్ని తెలిపే క్యూఆర్ కోడ్ను హాల్ టికెట్ల పై ముద్రించారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. బాలికల కళాశాలలో 197 మంది, బాలుర కళాశాలలో 190 మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.