Diploma courses | సుల్తానాబాద్ రూరల్ మే 9 : రాష్ట్రంలో నూతనంగా మంజూరైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) హైదరాబాదు లో మొదటి సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంనకు గాను (60) సీట్లకు చేనేత, టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చేనేత, జౌళీ శాఖ సహాయక సంచాలకులు విద్యాసాగర్ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
2025-26 విద్య సవంత్సరానికి గాను కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) హైదరాబాద్ ద్వారా మూడు సవంత్సరాల ఈ కోర్సు కాలపరిమితి ఉంటుందని పేర్కొన్నారు. కావున జిల్లాలోని యువత నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. ఈ కోర్సుపై అవగాహన సదస్సు మే 16న ఉదయం 11.30 గంటలకు సహాయ సంచాలకులు చేనేత, జౌళీ శాఖ కరీంనగర్ కార్యాలయములో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కావున జిల్లాలోని చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఈ కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని, ఇతర వివరాలకు సహాయ సంధాలకులు చేనేత, జౌళీ శాఖ, కరీంనగర్ కార్యాలయం, మంకమ్మ తోట ఫోన్ నంబర్లు 9849391548/8520079865ను సంప్రదించాలని సూచించారు.