పాలకుర్తి : ప్రజలు, విద్యార్థులు, యువత ఆంటీ డ్రగ్స్ కి పూర్తిగా సహకరించాలని, యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామును గ్రామస్థాయికి తీసుకెళ్లాలని బసంత్ నగర్ ఎస్ఐ స్వామి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులతో రాజీవ్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఘనశ్యాందాస్ నగర్ యూనివర్సల్ పాఠశాల నుంచి బసంత్ నగర్ బస్టాండ్ వరకు విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లో గంజాయి, మత్తుపదార్థాలు ఉపయోగిస్తున్న వారి వివరాలు పోలీసులకు అందజేయాలని కోరారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు.