పెద్దపల్లి రూరల్, ఆగస్టు 18: కోరిన కోర్కెలు తీరుస్తాడన్న నమ్మకంతో ప్రతియేటా జయంతిలకు, శ్రావణమాసంలో ఆంజనేయస్వామి మాల ధరించే స్వాములు పాదయాత్రగా కొండగట్టుకు (Kondagattu) వెళ్లి మొక్కులు చెల్లించుకుని రావడం కుర్మపల్లి వాసులకు ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే పెద్దపల్లి మండలం కుర్మపల్లికి చెందిన పలువురు ఆంజనేయస్వామి మాల వేసుకున్న స్వాములు దీక్షల అనంతరం మొక్కుల కోసం ముడుపులతో కాలినడకన పాదయాత్రగా కొండగట్టుకు బయలు దేరారు.
వారికి ఆలయ పూజారి ప్రత్యేక పూజలు చేసి మాల విరమణకు ఇరుముడి కట్టి కుటుంబ సభ్యుల భక్తుల కొలాహలం మద్య కొండగట్టుకు సాగనంపారు. పాదయాత్రగా కాలినడకన కొండగట్టుకు బయలు దేరిన వారిలో శివరాజ్, సందీప్, ఆది, విజయ్, లక్ష్మణ్, చాలా రమేష్ , ప్రశాంత్ , మేడగొని తిరుపతి , మేక మల్ల సదాశివ, నక్క నవీన్ తదితరులున్నారు.