కోల్ సిటీ, మార్చి 4 : తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, టీఆర్ఎస్(తెలంగాణ రక్షణ సమితి) బలోపేతానికి కృషి చేస్తానని డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు అన్నారు. ఈ మేరకు గోదావరిఖనికి చెందిన ఆనంద్ బాబు మంగళవారం హైదరాబాదులో టీఆర్ఎస్ లో చేరగా, సమితి రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ పటిష్టతకు కృషి చేస్తూనే ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నిలబెట్టుకోవాలని, లేదంటే ఉద్యమకారులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోడేటి శంకర్ గౌడ్, ఈదు నూరి నర్సింగ్, కనుకుంట్ల రమేష్, మామిడిపల్లి శ్రీనివాస్, శివ, చిలుముల సంతోష్, తాటికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.