కాల్వ శ్రీరాంపూర్ సెప్టెంబర్ 4 : పత్తి పంటను కోతుల బారి నుండి కాపాడుకోవడానికి ఓరైతు వినూత్న ఆలోచన చేశాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల గ్రామ పరిధిలోని జగ్గయ్యపల్లెకు చెందిన లోనే కుమార్ మల్యాలలో 4 ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు సాగు చేస్తున్నాడు.
2 ఎకరాల వరి, 2 ఎకరాల పత్తి పంటతో పాటు మొక్కజొన్న పంట సాగు చేశాడు. పత్తి పంట ఏపుగా పెరిగి కాత, పూత మంచిగా వచ్చింది. చేతికందే దశలో ఉన్న పత్తి పంటను కోతుల గుంపు పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ విషయమై రైతన్న వినూత్న ఆలోచన చేశాడు. పత్తి పంటలో కొండెంగ(Langur) బొమ్మతో 4ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దీంతో కోతులు పరార్ అవుతున్నాయని తెలిపాడు.