Collector Koya Sriharsha | ఓదెలలో ఆకస్మికంగా పర్యటించిన పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కొలనూరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.
Collector Koya Sriharsha | ఓదెల, జులై 3 : ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కొలనూరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తు మేరకు కొమిరె గ్రామంలో భూ సమస్యను పరిశీలించారు. ఓదెలలో నూతనంగా నిర్మితమవుతున్న తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఓదెలలో అద్దె భవనంలో కొనసాగుతున్న జూనియర్ సివిల్ కోర్టు కోసం నిరుపయోగంగా ఉన్న ఐకేపీ భవనాన్ని పరిశీలించారు. ఈ భవనాన్ని మరమ్మతులు చేయించి కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. అనంతరం మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులతో సమావేశమై పాలనాపరమైన అంశాలను చర్చించి తగు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ వనజా నాయక్, ఎంపీడీవో వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి, పీఆర్డీఈ పద్మ, ఏఈ సచిన్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

