తెలంగాణచౌక్, అక్టోబర్ 28 : విద్యార్థులకు ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్, కార్యదర్శి మారుతి మాట్లాడుతూ, విద్యార్థులకు 6,350 కోట్ల ఫీజులు పెండింగ్లోఉన్నాయని తెలిపారు.
రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఫీజు బకాయిలను విడుదల చేయలేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించలేని దుస్థితితో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఇక్కడ పీడీఎస్యూ నాయకులు అంజని, ప్రసాద్, శేఖర్, శ్రావణి, అంజలి పాల్గొన్నారు.