TSRTC MANTHANI | రామగిరి, ఏప్రిల్ 03: మంథని పెద్దపల్లి రూట్ లో బస్సుల సంఖ్య పెంచాలని టీఎస్ఆర్టీసీ అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రూట్ లో మంథని డిపో కు చెందిన బస్సులు అంతంతా మాత్రమే నడుస్తుండంతో గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి తప్పడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
మంథని డిపో కు చెందిన బస్సులు తెల్లవారు జాము 4గంటలకు ప్రారంభమై రాత్రి 11గంటల వరకు అర్ద గంట, గంట ఒకటి నడుస్తున్న వేళాపాల లేకుండా నడుస్తున్నాయని, దీంతో చాలా కష్టపడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంథని నుంచి పెద్దపల్లి వరకు మొత్తం 19 స్థాప్ లతో స్టేజిలు ఉండగా ఈ మార్గం లో బేగంపేట ఎక్స్ రోడ్, సెంటినరికాలనీ స్టేజీ ల వద్ద అధిక సంఖ్యలో ప్రయణికులు బస్సులో ప్రయాణిస్తుంటారని, మంథని నుంచి బయలు దేరు బస్సులు అక్కడే ప్రయాణికులతో నిండి వస్తుండగా బస్సు కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశే మిగులుతోందని వాపోతున్నారు.
ఇక చేసేది ఏమి లేక అదే బస్సు లో నిలిచి ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొందని పండిపడుతున్నారు. ఈ రూట్ అదనపు బస్సులు నడపవాల్సిన మంథని డిపో అధికారులు మాత్రం నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని, టీ ఆర్ టి సీ ఎండి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి మంథని, పెద్దపల్లి రూట్ లో అదనపు బస్సులు వేసేలేలా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.