Alaya Foundation | కోల్ సిటీ, ఏప్రిల్ 14 : రామగుండం ముద్దుబిడ్డ, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి భారత ప్రభుత్వంలో కీలక అధికారిగా నియమితులై తెలంగాణ గర్వించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు. ఈమేరకు ఆలయ ఫౌండేషన్ సభ్యుడు లంక సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో పటాకలు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. జీవితంలో ఎదగడానికి పేదరికం అడ్డు కాదని నిరూపించిన ఐఏఎస్ అధికారి నరహరి ఇండోర్ నగరంను దేశంలో మొదటిస్థానంలో నిలబెట్టాడనీ, 400 మంది యువతను కలెక్టర్లుగా తీర్చిదిద్దాడని పేర్కొన్నారు.
ఆలయ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆయన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి కేంద్రంలో కీలక పదవి ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. భవిష్యత్ లో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్, గడ్డం శంకర్, జాన్ వెస్లీ, లంక నరేశ్, గడ్డం రమేష్, రాజేష్, మహేందర్, శనిగరపు చింటు తదితరులు పాల్గొన్నారు.