Panchayat elections | సిరిసిల రూరల్, డిసెంబర్ 1: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఆ ఇద్దరిని కలిపాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్పంచి ఎన్నికలు చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య కలిసిపోయారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సూచనతో సర్పంచ్ బరిలో నుంచి మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య విరమించుకున్నారు.
కేటీఆర్ సూచనతో సర్పంచ్ బరిలో మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అంకారపు రవీందర్ కు మద్దతు తెలిపారు. అంతేకాదు సోమవారం కోడి అంతయ్యతో కలిసి అంకారపు రవీందర్ నామినేషన్ దాఖలు చేశారు. గత కొన్ని ఏళ్లుగా స్థానిక ఎన్నికలు వీరు ఇద్దరు పోటీ పడటం కొనసాగుతూ ఉన్నది. ఈ క్రమం లో ఈ సారి పంచాయతీ ఎన్నికలలో కలిసి పోవడం శుభసూచకం బి అర్ ఎస్ పార్టీ నేతలు, పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామంలో రాజకీయ ఉద్ధండులు కలిసి పోవడం చర్చనీయాంశంగా మారింది.