Pamela Satpathy | కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 15 : ఉత్తర తెలంగాణ జిల్లాల పట్టభద్రులు, శాసనమండలి ఎన్నికల పోలింగ్ ఈనెల 27న జరుగనున్న నేపథ్యంలో, పోలింగ్ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు జిల్లాలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆమె ఇవాళ సందర్శించారు.
ఈ సందర్భంగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేయబోయే గదులు, అక్కడున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ సంఖ్యను ఓటర్లకు కనిపించే విధంగా ప్రదర్శించాలని సూచించారు.
అన్ని కేంద్రాల్లో ధారాళంగా వెలుతురు ఉండేలా చూడాలని, ప్రతీ ఓటరు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో కె.మహేశ్వర్, తహసీల్దార్లు నరేందర్, అనుపమ, ఎంపిడివో రాము, ఆర్ఐలు శ్రీనివాస్, రాజుతోపాటు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు