KOURUTLA | కోరుట్ల, మే 7: కోరుట్ల పట్టణంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారు అక్రమంగా నివసిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని, విదేశీయులను పట్టుకొని స్వస్థలాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ జివాకర్ రెడ్డికి బుధవారం వినతి పత్రం అందజేశారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి అక్రమంగా ప్రవేశించిన వలసదారులు పట్టణంలో అక్రమంగా నివసిస్తున్నట్లు ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. విదేశీయులతో భద్రత సమస్యలు ఉత్తన్నమవుతాయని, భవిష్యత్తులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించాలని పేర్కొన్నారు.
అక్రమంగా నివాసముంటున్న విదేశీయులను గుర్తించి వారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇందూరి తిరుమల వాసు, సుదవేనీ మహేష్ , ఎర్ర రాజేందర్, ఓల్లోజి నగేష్, సాడిగే మహేష్, కలాల సాయి చందు, మేకల గణేష్, దమ్మ సంతోష్, రాజేందర్ రెడ్డి, ప్రశాంత్, రాహుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.