Toilet | జగిత్యాల టౌన్, జూన్ 26 : జగిత్యాల జిల్లా కేంద్రం ధరూర్ క్యాంపులోని ప్రభుత్వ పాఠశాలలో 300 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండగా.. దానికి కూడా తాళం వేసి ఉండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
పాఠశాలలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉండగా.. అందులో 260 మంది బాలురు, 40 మంది బాలికలున్నారు. ఈ పాఠశాలలో బాయ్స్‌కు ఒకే ఒక టాయిలెట్ ఉన్నప్పటికీ దానికి తాళం వేయడంతో చేసేదేమీ లేక విద్యార్థులు ఆరు బయటకు వెళ్తున్నారు. పాఠశాలలో సరిపడా టాయిలెట్స్ లేకపోవడంతోపాటు ఉన్న ఒక్క టాయిలెట్‌ను చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చి వెళ్లేవారు వాడుకోవడంతో ఈ టాయిలెట్‌కు తాళం వేసినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో పాఠశాలకు వచ్చే విద్యార్థులు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు సైతం అర్జంట్ అయితే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ పాఠశాల ఆవరణలో చేపట్టిన వంటగది నిర్మాణం బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. 300 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో కనీసం పీఈటీ కూడా లేకపోవడంతో పిల్లలు ఆటలకు దూరంగా ఉన్నారు.
14 మంది టీచర్లు ఉండాల్సిన బడిలో 9 మంది టీచర్లే ఉన్నారు. ఈ పాఠశాలకు చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో అపరిశుభ్రత నెలకొంది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా పాఠశాలలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని స్థానికులు, విద్యార్థులు కోరుతున్నారు.
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి