Road Accident | మెట్పల్లి ,మే 23: మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని ఆర్ పేట శివారులో గల శివాలయం సమీపంలో 63వ జాతి రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆర పేట గ్రామానికి చెందిన చక్రాల రాజం( 55)కు తీవ్ర గాయాలయ్యాయి . శుక్రవారం మధ్యాహ్నం మెట్పల్లి నుంచి మోటార్ సైకిల్ పై రాజం ఆర పేటకు వెళుతుండగా రహదారిపై పైపుల లోడ్ ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో రాజం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడ్డుపై నిలపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు దాని గురించి చెప్తున్నారు.